తమిళ పవర్ స్టార్ అజిత్ కుమార్, వీరుడొక్కడే(తమిళంలో వీరం) చిత్ర దర్శకుడు శివ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తున్నారు. సెక్సీ హీరోయిన్ శృతిహాసన్ అజిత్ కు జోడిగా నటిస్తుంది. లక్ష్మీమీనన్ అజిత్ చెల్లెలు క్యారెక్టర్ లో నటిస్తుంది. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ సినిమాని అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని దీపావళికి విడుదల చేయాలని చిత్ర నిర్మాత ఎ.ఎమ్.రత్నం తెలియజేశాడు. అజిత్ తాజా చిత్రం ఎంతవాడుగానీ తెలుగులో మంచి మార్కెట్ చేసినందున నెక్స్ట్ ప్రాజెక్టును కూడా తెలుగులో రిలీజ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు రత్నం తెలిపారు.