సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ చాన్నాళ్ళు తెరమీదకు రాకుండా ఉండిపోయిన ఆరడుగుల ఆజానుబాహుడు రానాను లీడర్ గా శేఖర్ కమ్ముల తెరకు పరిచయం చేశాడు. రావడమైతే వచ్చాడు గానీ... ఇప్పుడున్న హీరోల స్థాయిని అందుకోలేకపోయాడు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఓ రెండు మూడు సినిమాలు చేశాడు గానీ పెద్దగా క్లిక్ అవ్వలేదు. ఇప్పుడు బాహుబలి, రుద్రమదేవి సినిమాలతో ఆడియన్స్ లో ఓ టైప్ క్రేజ్ పెంచుకున్నాడు రానా. ఈ క్రేజ్ ను మన సౌత్ సినిమా వాళ్ళు ఉపయోగించుకోవాలని చూస్తున్నారు.
తమిళ హీరో అజిత్, రానాలతో ఓ హిస్టారికల్ సినిమా తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా కూడా తెలుగుతమిళంలో చేయాలనుకుంటున్నారట. తమిళంలో బిల్లాఆరంభం వంటి యాక్షన్ మూవీలు తీసిన విష్ణువర్ధన్ ఈ సారి రాజుల కథ ఒకటి సిద్ధం చేసుకున్నాడట. అది కూడా చోళ సామ్రాజ్య గురించి హిస్టరీని పరిశీలిస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి స్క్రిప్ట్ కూడా రెడీ చేశాడట విష్ణువర్థన్. ఒక రాజుగా అజిత్ ను ఎంపిక చేసిన దర్శకుడు మరో రాజుగా రానా అయితే బాగుంటుందనుకున్నాడట. ఈ ఇద్దరు హీరోలు కలిసి తమిళంలో ఆరంభం సినిమాలో నటించారు. చోళ సామ్రాజ్యపు రాజులుగా అలరించబోతున్నారు.