కోలీవుడ్ లో తల అజిత్ ది ప్రత్యేక స్థానం. రజనీకాంత్ తర్వాత అక్కడ అంతగా క్రేజ్ ఉన్న హీరో ఎవరంటే విజయ్ అని టక్కున చెబుతారు. కానీ, ఒకరకంగా అజిత్ విజయ్ కి గట్టి పోటీనిస్తానటంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే వీరిద్దరి ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వారి వైరాన్ని అర్థం చేసుకున్న ఆ హీరోలు కూడా తమ తమ సినిమాలను టైం చూసుకుని వదులుతుంటారు.
అందుకే పులి సినిమా రిలీజైన నెలకి అజిత్ వేదాళం వదిలాడు. పులి ఫలితం ఏంటో మనందరికీ తెలుసు. అయితే అజిత్ మాత్రం బంఫర్ హిట్ కొట్టేశాడు. ఇప్పడు తమిళనాట అజిత్ అరుదైన రికార్డును సృష్టించాడు. వేదాళం తొలిరోజునే 15.5 కోట్లను వసూలు చేసింది. భారీ అంచనాల మధ్య దీపావళి సందర్భంగా విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది.
ఇక గతంలో రజనీకాంత్ 'లింగ' సినిమా తొలిరోజున 12.8 కోట్లు వసూలు చేస్తే, విజయ్ 'కత్తి' 12.5 కోట్లను రాబట్టింది. ఇక. వాటిని అధిగమిస్తూ అజిత్ నటించిన 'వేదాళం' 15.5 కోట్లతో కొత్త రికార్డును నెలకొల్పింది. అజిత్ ఇమేజ... 'వీరమ్' లాంటి హిట్ ఇచ్చిన శివ దర్శకుడు కావటంతో చిత్రంపై భారీ అంచనాలు పెరిగి ఓపెనింగ్స్ లో తమిళనాట రికార్డులను తుడిచిపెట్టి పడేసింది. సాధారణంగా రజనీకాంత్ రికార్డులను ఇప్పటిదాకా ఏ హీరో బ్రేక్ చేయలేకపోయారు. కానీ, తల దెబ్బకి అదంతా మటుమాయం అయిపోవటం కోలీవుడ్ లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.