అజిత్ కి వారసుడొచ్చాడు

March 02, 2015 | 12:42 PM | 36 Views
ప్రింట్ కామెంట్
Ajith_shanili_blessed_a_baby_boy

తెలుగులోనూ ఆశ, ప్రేమలేఖ వంటి సినిమాలతో అలరించిన హీరో అజిత్. ప్రస్తుతం తమిళ అనువాద సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. నటి షాలినిని అజిత్ ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఆల్రెడీ ఓ పాప ఉంది. సోమవారం ఉదయం షాలిని ఓ పండంటి మగబిడ్డను ప్రసవించింది. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అజిత్ త్వరలో ఎంతవాడుగానీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అజిత్ నటించిన ఈ సినిమాలో అనుష్క, త్రిష కీలక పాత్రలు పోషించారు. తమ అభిమాన హీరోకి పుత్రోత్సాహం కలగడం ఆనందంగా ఉందని అజిత్ ఫ్యాన్స్ ట్విట్టర్, ఫేస్ బుక్ ల్లో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అజిత్ తనయుడికి అప్పుడే కుట్టి తల అనే పేరును కూడా వారు ఫిక్స్ చేసేశారు. అజిత్ ను తమిళ అభిమానులు తల అని పిలుస్తారన్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ