సంవత్సరం వయసులోనే సినిమాలో నటించిన సిసింద్రీ అఖిల్ కు అప్పటి నుంచీ ఫ్యాన్ ఫాలోయింగ్ మొదలైంది. ఎక్కడ సినిమా ఫంక్షన్ లో కనిపించినా అందరినీ ఎట్రాక్టివ్ చేస్తూనే వస్తున్నాడు. ఇక సిసిఎల్ తో అమ్మాయిల గుండెల్లో స్థిరపడిపోయాడీ నవమన్మథుడు. ఎన్నాళ్ళనుంచో తన వారసుడితో పెద్ద హిట్ ఇవ్వాలని కథకోసం, డైరెక్టర్ కోసం అణ్వేషించిన నాగార్జున, అవి కుదిరాక హీరోయిన్ కోసం వెతకడం మొదలు పెట్టారు. ఎట్టకేలకు ముంబయి భామకే ఈ ఛాన్స్ దక్కింది. 17 యేళ్ళ సాయేషా సైగల్ ఇంటర్నేషనల్ డిగ్రీ పూర్తి చేసింది. ఈమె కూడా సినీ వారసురాలే. తాత (దిలీప్ కుమార్), తల్లిదండ్రులూ (షాహిన్, సుమీత్ సైగల్) సినిమా వాళ్ళే. అచ్చంగా అఖిల్ మాదిరిగానే. ఇద్దరి తాతలకూ మంచి స్నేహ సంబంధాలున్నాయి. అమ్మాయి పోస్టర్ చూసిన అభిమానులు అఖిల్ జోడీ పర్ ఫెక్ట్ గా కుదిరిందంటూ సంతృప్తి పడుతున్నారు. ఈ అమ్మడికి హిందీలో అజయ్ దేవగన్ దర్శకత్వంలో ఓ సినిమాలో ఛాన్స్ వచ్చింది కానీ ఆ ప్రాజెక్టు ఎందువల్లో ఆగిపోయిందట. చివరికి అఖిల్ సరసన సినిమా ఛాన్స్ కొట్టేసింది. ఈ అమ్బామడిని లీవుడ్ నుంచి తీసుకురావడం వల్ల గతంలో అక్కడి నుంచి వచ్చిన హీరోయిన్లతో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి కాబట్టి నాగార్జున ఈమెతో పక్కాగా అగ్రీమెంట్ చేయించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తయ్యేవరకూ మరే సినిమాలోనూ నటించకూడదనీ, షూటింగ్స్ కు, సినిమా ప్రమోషన్లకు సంబంధించిన డేట్స్ పై కూడా షరతులు పెట్టి మరీ అగ్రీమెంట్ చేయించుకుంటున్నాడట నాగార్జున.