సల్మాన్ కు సాధారణంగా కోపం రాదు. ఎక్కడ కనిపించినా చాలా జోవియల్ గా ఉంటాడు. అలాంటి ఆయనకు కోపం తెప్పించాడు కరణ్ జోహార్. దీనికి కారణం కరణ్ సల్లుభాయ్ చెల్లిపైనే జోకులు పేల్చడం. కరణ్ జోహార్ హోస్ట్ గా చేస్తున్న ‘ఏఐబీ’ షోలో సల్మాన్ చెల్లి అర్పితాపై జోకులు వేశారట. ఈ షోకు ప్రొడ్యూసర్ కం, డైరెక్టర్ అయిన కరణ్ జోహార్, బాలీవుడ్ నటులు రణ్ వీర్ సింగ్, అర్జున్ కపూర్ లు పాల్గొన్న ఒక కార్యక్రమంలో సల్లుభాయ్ సోదరి అర్పితా ఖాన్ పేరు ప్రస్తావించడం, ఆమెపై జోకులు వేయడంపై సల్మాన్ ఖాన్ చాలా సీరియస్ అయ్యాడు. ఇలాంటి పిచ్చి పనులు చేస్తే స్నేహితుడని కూడా చూడనని కరణ్ కి సల్మాన్ గట్టి వార్నింగ్ ఇచ్చాడట. అంతేకాదు, ఇక ముందు ఇలా జరిగితే ఇప్పుడు ఒప్పుకున్న కరణ్ ప్రాజెక్టు ‘శుద్ధి’ నుంచి కూడా తప్పుకుంటానని హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు సల్మాన్ కరణ్ పేరు ఎత్తితే కోపంతో చిటపటలాడిపోతున్నాడట. బయట ఎన్ని జోకులేసినా పట్టించుకోను, కానీ పబ్లిక్ లో ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే ఊరుకోనంటున్నాడు. అయితే కరణ్ తన పొరపాటును గ్రహించి యూ ట్యూబ్ లో ఈ ఎపిసోడ్ లోని సల్లూ అభ్యంతర పెట్టిన వ్యాఖ్యలను కట్ చేశాడని టాక్. సల్మాన్ చెల్లిపై ఎంత ప్రేమ కురిపించాడో ఆమె పెళ్ళి చేసిన విధానమే తెలుస్తోంది. అలాంటి చెల్లిపై అది కూడా ఫీల్డ్ కు సంబంధం లేని ఆమెపై జోకులేయడమేంటి?