అక్కినేని వారసులు ఇద్దరూ ఇప్పుడు సినిమా రంగాన్ని ఊపేసే దశలో రెచ్చిపోతున్నారు. నాగచైతన్య ఇప్పటికే సీనియారిటీ సంపాదించేశాడు. ఇప్పుడే సినిమా ఎంట్రీ ఇవ్వబోతున్న అక్కినేని అఖిల్ అక్కినేని. టాలీవుడ్ స్టార్ కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ కాంబినేషన్ లో మొదటి సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. అయినా అఖిల్ మాత్రం తన మొదటి సినిమా విషయంలో ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా భారీ ఎత్తున ప్రమోట్ చెయ్యడానికి ప్లాన్ చేసుకున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 21న ఈ సినిమా రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్ కి ముందే బాలీవుడ్ స్టైల్ లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ప్రమోషనల్ టూర్ వెయ్యడానికి ప్లాన్ చేసాడు. అఖిల్ చెప్పిన సమాచారం ప్రకారం ‘బాలీవుడ్ స్టైల్ లో ఈ సినిమా మార్కెటింగ్ ని ప్లాన్ చేసాం. అందులో భాగంగానే గ్రాండ్ ప్రీ రిలీజ్ టూర్ ప్లాన్ చేశారట. రిలీజ్ కు ముందే తన చిత్ర టీం అంతా కలిసి యుఎస్ లోని 3 సిటీలలో పయనిస్తారట. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లతో కలుపుకొని మొత్తం 5 నగరాల్లో పయనించనున్నారని తెలిపారు. అఖిల్ ను ఇప్పటి వరకూ తల్లిదండ్రులు నడిపిస్తున్నారనుకున్నాం. గానీ తన సొంత నిర్ణయాలతో తన సినిమా మంచి హిట్ చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నాడు. ఇంత ప్లానింగ్ తో ఉన్నాడంటే సినిమాలో కూడా రిస్క్ తీసుకుని ఇరగదీసి ఉంటాడనుపిస్తోంది.