రుద్రమదేవి రిలీజ్ అక్టోబర్ 9న

September 01, 2015 | 04:14 PM | 1 Views
ప్రింట్ కామెంట్
rudramadeve_release_dilemma_niharonline

ప్రముఖ దర్శక నిర్మాత గుణశేఖర్ తో ప్రతిష్టాత్మంగా తీసిన కాకతీయుల హిస్టారికల్ మూవీ ‘రుద్రమదేవి’ అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ చిత్రం మొదట సెప్టెంబర్ 4న విడుదల చేయాలనుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఈ తేదీని అక్టోబర్ 9కి మార్చారు. ఈ విషయమై దర్శక నిర్మాత గుణశేఖర్ మాట్లాడుతూ... తెలుగు వారందరికీ గర్వకారణమైన రుద్రమదేవి చరిత్రని తెరపై చూడాలని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విడుదల తేదీ మార్చినందుకు క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను. 3డి టెక్నికల్ వర్క్ తో జరిగిన జాప్యం కారణంగానే రిలీజ్ డేట్ వాయిదా వేయవలసి వచ్చింది. 13వ శతాబ్ద: నాటి కాకతీయ వైభవం ప్రేక్షకుడికి మర్చిపోలేని అనుభూతిని మిగలాలనే సాంకేతికంగా ఎన్నో అవరోధాలు దాటుకుని 3డిలో ఈ సినిమా రూపొందించాం. భారత దేశంలోనే తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి చిత్రం మాదే కావగం గర్వంగా భావిస్తున్నాం. తెలుగు, తమిళం, మళయాలంతో పాటు హిందీలో కూడా ఈ చిత్రం ఒకేసారి విడుదల కానుంది. రుద్రమదేవి హిందీ వెర్షన్ ని రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్, అభిషేక్ పిక్చర్స్ కలిసి విడుదల చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, నెల్లూరు, వెస్ట్ గోదావరి జిల్లాల్లో కూడా రిలయన్స్ సంస్థ పంపిణీ చేస్తుంది. తెలుగులో హేమా హేమీలైన ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, సాయి కొర్రపాటి, ఎన్.వి.ప్రసాద్ ఈ చిత్రానికి పంపిణీ దారులుగా డటం ఎంతో గర్వంగా ఉంది’’ అని వివరించారు. ఈ చిత్రంలో అనుష్క, రాణా, అల్లు అర్జున్, కృష్ణం రాజులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ