అఖిల్ సినిమా ఎంట్రీ గురించి అక్కినేని నాగార్జున చాలా ఆచీ తూచీ అడుగేశారు. ఆడియన్స్ లో క్రేజ్ కూడా మనం సినిమాతో పెంచేశారు. అఖిల్ సినిమా స్టోరీ సెలక్షన్ తో పాటు ఓ కమర్షియల్ డైరెక్టర్ చేతిలో అఖిల్ సినిమాను పెట్టేశారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుతూ... ఒక పక్క ఆడియన్స్ లో సినిమా గురించిన క్రేజ్ పెంచుతూ వచ్చారు. ఇక సినిమా ఫస్ట్ లుక్ నాగార్జున బర్త్ డే రోజున విడుదల చేసి, జనాల్లో క్యూరియాసిటీని పెంచేశారు. టీజర్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ తో కలిసి విడుదల చేసి, యూత్ లో మరింత క్రేజ్ ను తీసుకు వచ్చారు. అసలే అక్కినేని ఫామిలీ స్మార్ట్ బాయ్... దాంతో వారసత్వంగా వస్తున్న అభిమానులు... ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న సినిమా... ఇక టీజర్ వదిలితే అభిమానులు ఆగుతారా....? ఈ టీజర్ పై ఎగబడి పోయారు. 24 గంటల్లో 5లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి టీజర్ వ్యూస్ ను చూసిన ఈ మూవీ మేకర్స్ చాలా ధీమాగా ఉన్నారు. సినిమా సక్సెస్ దీనిపై ఆధారపడి ఉందనుకుంటున్నారు. సెప్టెంబర్ 20 ఆడియో, అక్టోబర్ 21 సినిమా విడుదల ఇప్పటికే అనౌన్స్ చేశారు. అభిమానులను పక్కన పెడితే సగటు ప్రేక్షకుడు, ఫిల్మ్ క్రిటిక్స్ మాత్రం అఖిల్ ఫేస్ ఫీలింగ్స్ ఎక్కడైనా చూపిస్తారేమో నని టీజర్ ఆసక్తిగా చూశారు కానీ, యూత్ ను ఆకట్టుకునేలా కొద్దిగా యాక్షన్ సీన్స్ మాత్రం చూపిండడంతో అఖిల్ టీజర్ చాలా జాగ్రత్తగా కట్ చేశారనుకుంటున్నారు.