జక్కన్న సృష్టించిన బాహుబలి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ రోజుల్లో సినిమాలు ఎంత బాగున్నా కలెక్షన్లతో 30 రోజులు థియేటర్లలో నిలబడిందంటే చాలా గొప్ప విషయంగా చెప్పుకోవాలి. కానీ బాహుబలి 50 రోజులైనా దాదాపు చాలా థియేటర్లలో నడుస్తూనే ఉంది. ఈ చిత్రం విడుదలైన అన్ని బాషలలో విపరీతమైన కలెక్షన్లను రాబట్టింది. కేవలం తెలుగు బాషలోనే దాదాపు 129 కేంద్రాల్లో ఈ సినిమా యాభై రోజులు పూర్తీ చేసుకోవడం విశేషం. రెండు ... ఇలా ఈ మధ్య కాలంలో ఏ సినిమాలూ నడవకపోవడం విశేషంగా చెప్పుకోవాలి. ఇటీవలే రాజమౌళి బలవంతంగా థియేటర్లలో నడిపించకండి అంటూ పిలుపు ఇచ్చారు కూడా. దీంతో ఈ సినిమా కొన్ని కేంద్రాల్లో తీసివేసే ఛాన్సెన్స్ ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో నిలబెట్టింది. ఇప్పటి వరకూ ఈ సినిమా రాబట్టి వసూళ్ళు నైజాం - 41. 13 కోట్లు , సీడెడ్ - 21. 52 కోట్లు , గుంటూరు - 9. 70 కోట్లు , ఉత్తరాంధ్ర- 9. 60 కోట్లు , ఈస్ట్ - 8. 60 కోట్లు , వెస్ట్ - 6. 78 కోట్లు , కృష్ణా - 6. 70 కోట్లు , నెల్లూరు - 4. 08 కోట్లు , మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 108. 02 కోట్ల వసూళ్లు చేసింది. ఇక కర్ణాటక లో 35 కోట్లు తెలుగు వెర్షన్ రాబట్టింది. మొత్తానికి బాహుబలి అన్ని బాషలలో కలిపి దాదాపు 568 కోట్ల వసూళ్లన సాధించింది. ఈ సినిమాను చైనా, పాకిస్థాన్ లోలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.