అక్కినేని అభిమానులను ఉద్దేశించి అఖిల్ అక్కినేని ఓ లేఖను రాశారు. తన తాజా సినిమా గురించి అందులో ప్రస్తావించారు.
``మా ప్రియమైన అక్కినేని అభిమానుల్లారా,
మీ ప్రేమకు, ప్రోత్సాహానికి పేరు పేరునా ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను చిన్ననాటి నుంచి కలలు కన్న రోజు అతి త్వరలో రాబోతోంది. నేను మరియు నా చిత్ర యూనిట్ అందరమూ బాగా కష్టపడి మిమ్మల్ని ఆనందింపజేయడానికి మీరు గర్వపడేలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. ఈ సినిమా షూటింగ్ సగం పూర్తయ్యింది. మిగిలిన సినిమాలో కొంత భాగాన్ని థాయిలాండ్లో షూట్ చేయడానికి వెళుతున్నాము.
ఈ సినిమా రిలీజ్కు ముందే నేను మిమ్మల్ని కలుసుకోవాలని ఎదురుచూస్తన్నాను. నేను ఈ చిత్ర అనుభవాలను ఎప్పటికప్పుడు మీతో పంచుకుంటాను. మీ అందరి మంచి కోరి మీకు నా శుభాకాంక్షలు
ప్రేమతో మీ