ఒకప్పుడు కథానాయికగా వెండితెరపై వెలిగిన అమల, ఆ తరువాత కుటుంబానికే ప్రాధాన్యతనిస్తూ వచ్చింది. అక్కినేని ఇంటి కోడలుగా, మరోవైపు సేవాకార్యక్రమాల్లో పాల్గొనటమే కాకుండా, ఇటీవల అతిథి పాత్రల్లో మాత్రమే నటిస్తు వస్తోంది. కేవలం 10 రోజుల కాల్షీట్ కి మించి ఇవ్వకూడదనే నిర్ణయానికి వచ్చిందట. అయితే లోకనాయకుడు కమల్ హాసన్ ఆమె తిరిగి హీరోయిన్ గా నటించబోతుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె స్పందించింది.
ఒక సినిమాను గురించి కమల్ ఆమెను సంప్రదించగా, ఆయనకి తన నిర్ణయం గురించి చెప్పిందట. హీరోయిన్ క్యారెక్టర్ అయితే కష్టమని, కావాలంటే గెస్ట్ రోల్ చేస్తానని తెలిపిందట. ఆ తరువాత సినిమా దర్శకుడు టీకే రాజీవ్ కుమార్ కథలో మార్పులు చేసి ఆమె కోసం ఓ ప్రత్యేక రోల్ ని క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. కథతో పాటు తన పాత్ర కూడా నచ్చడంతో తాను ఆ సినిమా చేయడానికి అంగీకరించానని అమల చెప్పుకొచ్చింది. ఒకప్పుడు కమల్ సినిమాలో కథానాయికగా చేసిన అమల, ఇప్పుడు ఆయన సినిమాలో అతిథి పాత్రను పోషిస్తే మంచి క్రేజ్ ఉంటుందని కమల్ యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కమలే నిర్మాతగా వ్యవహారిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఒకే కాలంలో విడుదల కానుంది.