టాలీవుడ్ లో మరో ప్రేమాయణం ఖతం

January 05, 2016 | 03:54 PM | 4 Views
ప్రింట్ కామెంట్
tollywood-hit-pair-love-story-end-niharonline

వెండితెరపైనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా తమ లవ్ స్టోరీలను కంటిన్యూ చేసిన జంటలు ఎన్నో ఉన్నాయి. నటించడమే కాదు ఆపై నిజజీవితంలో పెళ్లితో ఒక్కటయి సెటిల్ అయిపోయిన హీరోహీరోయిన్లు ఉన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో ఆ సాంప్రదాయం మచ్చుకైనా కనబడటం లేదు. ఓ నాలుగైదు సినిమాలు తీశామా? తిరిగామా? డేటింగ్ చేశామా? అన్న ధోరణిని ప్రదర్శిస్తున్నారు ఇప్పుడున్న యంగ్ స్టర్లు. ఇక్కడో అలాంటి జంట గురించి చెప్పుకుందాం...                 

                                            హీరోగా అతనికి, హీరోయిన్ గా(తొలిపరిచయం) మంచి హిట్ అందించింది ఆ చిత్రం. ఆ చిత్రం పుణ్యమాని ఇద్దరికి స్టార్ డమ్ రావటంతోపాటు ప్రేమ పక్షులుగా ఒక్కటయ్యారు.  ఆపై పార్టీలకు, పబ్ లకు తెగ షికార్లు కొట్టారు. ఆడియో పంక్షన్లలో తెగ సందడి చేశారు. ఏమన్నా అంటే ఫ్రెండ్ షిఫ్ అంటూ కవర్ చేశారు. ఆపై పీకల లోతు ప్రేమలో మునిగిపోయిన ఆ జంట హోటల్ రూంలలో ఏకాంతంగా గడిపినట్లు వార్తలు కూడా వచ్చాయి. కట్ చేస్తే... ప్రస్తుతం ఆమె బడా స్టార్ హీరోలతో వరుసగా చేసుకుంటూ పోతుంది. కోటికి పైగా రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్ జాబితాలో ఉంది. ఇక మామ అండతో ఇండస్ట్రీకి వచ్చిన అతగాడికి మాత్రం అప్పటి నుంచి సరైన హిట్లు లేకుండా పోయింది. ఆ మధ్య వచ్చిన ఒక సినిమా యావరేజ్ గా ఆడినప్పటికీ ప్రస్తుతం మాత్రం ఓ సౌత్ టాప్ హీరోయిన్ తో ఓ సినిమాలో నటిస్తున్నాడు.  గతంలో వీరికి మరిచిపోని హిట్ అందించిన అదే దర్శకుడు వీరిద్దరితో మరో మూవీ ప్లాన్ చేశాడంట. అయితే సదరు హీరోయిన్ మాత్రం ఇకపై ఆ హీరోతో సినిమా చేసే అవకాశమే లేదని తేల్చి చెప్పిందట. స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన ఈ అమ్మడు, హిట్లు లేని అతగాడి బాయ్ ఫ్రెండ్ ని లైట్ తీస్కుని అందివచ్చే బడా ప్రాజెక్టులను చేసుకుంటూ పోతుందని అర్థమౌతుంది. మొన్నటిదాకా తెగ తిరిగిన వీరిద్దరి బంధం తెగిపోయిందన్నది ఈ ఒక్క విషయంతో క్లారిటీ వచ్చేసిందంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ