సక్సెస్ అయ్యారంటే నెత్తిమీద పెట్టుకోవడం, ఫ్లాప్ అయ్యారంటే కిందకు పడదోయటం సినీ పరిశ్రమలో సర్వ సాధారం. స్టార్ హీరోలు డైరెక్టర్లకు, నిర్మాతలకు విలువివ్వడం అనేది కొంత మంది హీరోల విషయంలోనే జరుగుతుంది. ప్రభుదేవ బాలీవుడ్ లో రౌడీ రాథోడ్ సినిమా సక్సెస్ తో నెత్తిన పెట్టుకున్నారందరూ, సింగ్ ఈజ్ బ్లింగ్ ఫ్లాప్ తో అతను కొత్త కథ నెరేషన్ కు వెళితే, అక్షయ్ కుమార్ పెద్దగా స్పందించకుండా తిప్పి పంపించాడట. ఇప్పుడు గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్ వంటి మంచి సినిమాలకు దర్శకత్వం వహించి తనకంటూ ఓ ఐడెంటి సంపాదించుకున్న డైరెక్టర్ పై కూడా అలాంటి వివక్ష కనిపిస్తోందట అక్షయ్ కుమార్ విషయంలో. ఈ ఇద్దరూ కలిసి గబ్బర్ ఈజ్ బ్యాక్ అనే సినిమా చేశారు. అప్పట్లో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ రావడంపై అందరూ క్రిష్ ను పొగిడేశారు. కానీ సినిమా ప్రారంభం అయి, పూర్తి చేసుకునే సమయం వచ్చే సరికి క్రిష్ పేరు ఎక్కడా కనిపించకుండా చేస్తున్నాడట అక్షయ్ కుమార్. ఈ సినిమాను కేవలం అక్షయ్ కుమార్ సినిమాగా ప్రమోట్ చేయడంపై ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఎందుకిలా జరిగిందోనని ఆసక్తిగా ఆరాలు తీస్తున్నారు కొందరు. ఏదేమైనా గబ్బర్ ను రప్పించుకున్నారు, క్రిష్ ను వెనక్కి పంపించి వేశారని అనుకుంటున్నారు మన తెలుగు వాళ్ళు.