ఈ చెల్లెలు సెంటిమెంట్ సక్సెస్ అవుతుందా?

January 08, 2015 | 04:05 PM | 40 Views
ప్రింట్ కామెంట్

అక్క మొదట ఫీల్డులోకి వచ్చి తరువాత చెల్లెలు రంగ ప్రవేశం చేయడం చాలా మంది నటీమణుల విషయంలోనూ జరిగింది. కానీ అక్కలు సక్సెస్ అయినంతగా చెల్లెళ్లు సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఇదే విషయం శ్రుతిహాసన్ చెల్లెలు అక్షరను వేధిస్తున్న సమస్య. గ్లామర్ ఒలకబోయడంలో అక్కకు తానేమీ తక్కువ కాదన్నట్టు ‘షమితాబ్’ టీజర్ రిలీజ్ టైంలోనే రుజువు చేసింది. పొట్టి స్కర్టేసుకుని.. అందాల్ని ఆరబోస్తూ కనువిందు చేసింది. ఈ అమ్మాయి నటన విషయంలోనూ తక్కువేమీ కాదని ఆమె ఆర్టిస్టుగానే పుట్టిందని కితాబిచ్చేశాడు దర్శకుడు ఆర్.బల్కి. నటన విషయంలో కాంప్లిమెంట్స్ వచ్చేశాయి. గ్లామర్ విషయంలోనూ మార్కులు కొట్టేసింది. ఇక ‘షమితాబ్’ సినిమా మీద అంచనాలు ఎలా ఉన్నాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా కచ్చితంగా హిట్టవుతుందని అంటున్నారు బాలీవుడ్ జనాలు. అంతా ఓకే కానీ హీరోయిన్ల చెల్లెళ్లు ఎవరూ సక్సెస్ అయిన దాఖలాలు లేవు. జయసుధ చెల్లెలు సుభాషిణి, భానుప్రియ చెల్లెలు శాంతిప్రియ, రాధిక చెల్లెలు నిరోష, కాజల్ చెల్లెలు నిషా ఆర్తీ అగర్వాత్ చెల్లలు అదితిలు పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో అక్షరకు కూడా ఆ భయం పట్టుకుందట. ఐతే బాలీవుడ్‌లో మాత్రం కరిష్మా కపూర్ చెల్లెలు కరీనా, ప్రియాంక చోప్రా చెల్లెలు పరిణీతి చోప్రా సూపర్ సక్సెస్ అయ్యారు. ఈ లెక్క ప్రకారం చూస్తే బాలీవుడ్ లో ఎంటర్ అయిన అక్షరకు సెంటిమెంట్ కలిసొస్తుందేమో ఇక భయమెందుకు?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ