సినిమాల్లో ఒక్కో కమెడియన్ ది ఒక్కో ట్రెండ్. అలీ కొన్నాళ్లు ఏదో భాషతో నవ్వించాడు. మరికొన్నాళ్ళు ఆడా మగా కానీ క్యారెక్టర్లో... డబుల్ మీనింగ్ డైలాగులతో నవ్వించాడు... ఇక ఇదే తరహాలో డబుల్ మీనింగ్ స్రుతిమించిపోయి బూతు పురాణంలోకి దిగిపోయి 'చిన్నదాన నీకోసం'లో కామెడీ చేసే ప్రయత్నం చేశాడు. లెంగ్దీ సెన్సార్ కట్స్ గతంలో ఉండేవి కానీ ఈమధ్య అలాంటివి ఉండడం లేదు. కానీ ఈ సినిమాలో ఒక సీన్‌లో దాదాపుగా ఆలీ మాట్లాడిందంతా మ్యూట్ చేసేసారు. నవ్వడం కోసం బూతులు మాట్లాడ్డం అవసరమా? సినిమాల సంగతి పక్కన పెడితే ఈ మధ్య బుల్లితెరమీద అలీ టాక్ షో, ఎటిఎం వంటి షోల్లో యాంకర్ గా కనిపిస్తున్నాడు అలీ. ఈ షోల్లోనూ డబల్ మీనింగ్ మాటలు దొర్లకుండా పూర్తవవు. స్టేజ్ ఏంటి, ఎదురుగా ఎవరున్నారు అనేదేం లేకుండా ఆలీ తన బూతు పురాణాన్ని వల్లించేస్తున్నాడు. కానీ ఒక్కోసారి పక్కన ఫామిలీ మెంబర్స్ కూర్చున్నప్పుడు చూడ్డం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది కదా... సీనియర్ నటుడు, పేరున్న వాడు కావడం వల్ల సినిమాలు, టీవీ షోల ప్రొడ్యూసర్లు ఆయనకు స్వేచ్ఛ బాగానే ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఫామిలీ అందరూ కూర్చుని చూసేలా అలీ ఆరోగ్యకరమైన కామెడీ అందిస్తే బాగుంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.