సోలో హిట్ కోసం కార్తీ ఎదురుచూపులు

May 05, 2016 | 05:49 PM | 1 Views
ప్రింట్ కామెంట్
karthi-confidence-on-kashmora-hit-niharonline

సూర్య తమ్ముడిగా సినిమాల్లోకి వచ్చినప్పటికీ తనకంటూ ఓ సొంత ఐడెంటిటీ ఏర్పరుచుకున్నాడు కార్తీ. అయితేనేం అన్నలాగే ప్రయోగాలు చేస్తూ సక్సెస్ కు దూరంగానే ఉంటున్నాడు. పయ్య (తెలుగులో అవారా) కోలీవుడ్ లో అతని చివరి బ్లాక్ బస్టర్. పా రంజిత్ దర్శకత్వంలో వచ్చిన మద్రాస్ ఒక్కటే ఈ మధ్య అతను నటించిన యావరేజ్ చిత్రం. వచ్చిన చిత్రాలు వచ్చినట్లు పోతున్నాయి. అయితే తెలుగులో మాత్రం ఊపిరితో మరిచిపోలేని హిట్ అందుకోవటంతోపాటు నటనకు ప్రశంసలు అందుకున్నాడు కార్తీ. సొంత ఇండస్ట్రీలో మాత్రం హిట్ కొట్టాలన్న కల కలగానే ఉంటుంది. ప్రస్తుతం గోకుల్ దర్శకత్వంలో కార్తీ కథానాయకుడిగా 'కాష్మోరా' సినిమా తెరకెక్కుతోంది. సూపర్ నేచురల్ ఫాంటసీ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది.

                          లేటెస్ట్ టెక్నాలజీతో, భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కార్తీ మూడు విభిన్నమైన పాత్రలను పోషిస్తూ వుండటం విశేషం. ఈ నెల 25న కార్తీ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా, తనకి తప్పకుండా హిట్ ను ఇస్తుందనే నమ్మకంతో కార్తీ ఉన్నాడట. ఇందులో నయనతారతోపాటు, తెలుగమ్మాయి శ్రీదివ్య మరో హీరోయిన్ గా నటిస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ