హీరోలకు వారసులు చాలా మందే ఉన్నారు. గానీ హీరోయిన్ల వారసులంటూ చెప్పుకోదగిన వారెవరూ ఫీల్డులో నిలదొక్కుకోలేదు. ఇప్పుడు కొత్తగా జయసుధ రెండవ తనయుడు శ్రేయాన్ హీరోల బరిలోకి దిగాడు. శ్రేయాన్ నటించిన బస్తీ సినిమా ఆడియోను (జూన్ 21)న హేమాహేమీల మధ్య విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేసీఆర్ ఆడియో సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సినీరంగ అభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రోత్సాహం అందిస్తుందని తెలంగాణా సీఎం కేసీఆర్ అన్నారు. చిత్ర పరిశ్రమ మరింత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని సినీ దిగ్గజాలు, ఇతర ముఖ్యులతో సమావేశం ఏర్పాటు చేసి వారి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈ చిత్రం హీరోయిన్ ప్రగతి, హీరో శ్రేయాన్, జయసుధ, విజయనిర్మల, మోహన్ బాబు, దాసరి నారాయణరావు, జీవిత రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.