పాప్ మ్యూజిక్ రారాజు మైఖేల్ జాక్సన్ మరణించి ఏళ్లు దాటినా ఆయన జ్ఞాపకాలను అభిమానులు మరిచిపోలేక పోతున్నారు. మైఖేల్ మరణం తర్వాత ఆయన అఖండ అభిమాన లోకం విషాదంలో మునిగి పోయిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా మైఖేల్ జాక్సన్ వారసుడు...ప్రిన్స్ సంగీత ప్రపంచ రంగంలోకి దిగాడు. ఈ విషయం ఫ్యాన్స్ ను ఆనందంలో ముంచెత్తింది. ఇప్పటికే పాప్ సంగీత ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ సింగర్ జస్టిన్ బీబర్తో కలిసి ప్రిన్స్ ఓ మ్యూజిక్ ఆల్బం చేస్తున్నట్లు తెలుస్తోంది. జాక్సన్ ఫ్యామిలీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం 17 ఏళ్ల ప్రిన్స్, 20 ఏళ్ల బీబర్ కలిసి ఓ మ్యూజిక్ ఆల్బం రూపొందించే పనిలో ఉన్నారు. త్వరలో ఈ మ్యూజిక్ ఆల్బం ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అని అంతర్జాతీయ మీడియాలో వార్తా కథనాలు వెలువడ్డాయి.