ఇవీవీ తనయుల్లో ఒకరు యాక్షన్ హీరోగా తెరకు పరిచయం కాగా మరొకరు కామెడీ హీరోగా అభిమానులను అలరించాడు. నరేష్ ఎంగేజ్ మెంట్ మే 1న జరిగిన విషయం అందరికీ తెలిసిందే. మే 29న జరిగే నరేష్ వివాహానికి సోదరులిద్దరూ పత్రికలు పంచే హడావుడిలో నిమగ్నమై ఉన్నారు. అందులో భాగంగా సోమవారం వీరు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి పెళ్ళికి ఆహ్వానించారు. మే 29న రాత్రి 9 గంటల 3 నిమిషాలకు హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో నరేష్ వివాహం జరగనుంది. బంధు, మిత్రులు సపరివార సమేతంగా వచ్చి వధూవరులను ఆశీర్వదించాలని నరేష్ సోదరుడు రాజేష్ కోరారు. అల్లరి నరేష్ పెళ్లాడబోతున్న విరూప విజయవాడకు చెందిన అమ్మాయి. ఇంగ్లండ్ లోని యూనివర్శిటీ ఆఫ్ షెఫ్పిల్డ్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.