‘జేమ్స్ బాండ్’ ఆడియో లాంఛ్

May 15, 2015 | 10:49 AM | 55 Views
ప్రింట్ కామెంట్
James_Bond_Audio_Launch_niharonline.jpg

ఎ.కె.ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అల్లరి నరేష్, సాక్షిచౌదరి హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘జేమ్స్  బాండ్’. సాయికిషోర్ మచ్చ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల మే 14న హైదరాబాద్ లోని రామ్ నారాయణ ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీనువైట్ల, హీరో శ్రీకాంత్, అల్లరి నరేష్, అమ్మిరాజు, రామ్ అచంట, గోపించంద్ అచంట, సుధీర్ బాబు, సందీప్ కిషన్, దశరథ్, అనీల్ సుంకర, సాక్షిచౌదరి తదితరులు పాల్గొని చిత్రయూనిట్ ను అభినందించారు. శ్రీనువైట్ల ఆడియో సీడీలను ఆవిష్కరించి హీరో శ్రీకాంత్ కి అందించారు. ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలైంది. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ