అల్లరి నరేష్ నిశ్చితార్థం మే 1న వైభవంగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. వివాహం కూడా అన్నయ్య రాజేష్ ఈనెల 29న జరుగనున్నట్టు అన్నయ్య రాజేష్ అందరికీ తెలిపి, పెళ్ళికి అందరికీ ఆహ్వానించారు కూడా. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పెళ్ళి పత్రికను నెటిజన్లకు విడుదల చేశారు. నరేష్ వివాహం మే 29న రాత్రి 9గంటల 3 నిమిషాలకు హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో జరుగనుంది. ఈ నెలలో ఇద్దరు హీరోలు పెళ్ళిళ్ళు చేసుకోవడం విశేషం. ఇ.వి.వి సత్యనారాయణ పెద్ద కుమారుడు తన తమ్ముడి పెళ్ళి బాధ్యతలను నిర్వహిస్తూ... పెళ్ళిని ఘనంగా జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు.