తమ సొంత బ్యానర్ ఇవీవీ ప్రోడక్షన్లో అన్నయ్య రాజేష్ తో కలిసి బందిపోటు చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే దారుణంగా నిరాశ పరచడంతో ఈవీవీ తనయులిద్దరూ నిరుత్సాహాంతో ఉన్నారు. ఇక ప్రస్తుతం దాని నుంచి తేరుకుని ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారట. అల్లరి నరేష్ తన తాజా సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. సాయి అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్నాడు నరేష్. ఈ సినిమాను ఎ.కె.ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం సమర్పిస్తున్నారు. అనిల్ సుంకర నిర్మాత. గతంలో నరేష్ తో ‘యాక్షన్ త్రీడీ’ అనే చిత్రాన్ని తెరకెక్కించింది ఈ సంస్థే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతోంది. కామెడీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నరేష్ స్టైల్లో ఉంటూనే కొత్తగా ఉండేలా ప్రయత్నిస్తున్నట్టు యూనిట్ వర్గాల సమాచారం. మరీ ఇదైనా ఈ అల్లరోడిని గట్టేక్కించాలని ఆశిద్దాం.