పవర్ స్టార్ అభిమానులకు తియ్యటి వార్త. పవన్ అప్ కమింగ్ మూవీ గబ్బర్ సింగ్ -2 కి ముహుర్తం ఖరారైంది. అసలు ఈ చిత్రం `గోపాల గోపాల` చిత్రానికి ముందే మొదలు కావాల్సి ఉంది. స్ర్కిప్టు పక్కాగా లేకపోవటం, అనుకున్న సమయానికి పవన్ బీజీ షెడ్యూల్ కారణంగా చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. తొలుత ఈ చిత్రానికి ‘రచ్చ’ ఫేం సంపత్ నంది దర్శకత్వం వహించాల్సి ఉంది. అంతేకాదు ఆ మధ్య పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. కానీ స్క్రిప్ట్ విషయంలో పక్కాగా ఉండే పవర్ స్టార్, సంపత్ చెప్పిన కాన్సెప్ట్ పట్ల కాంప్రమైజ్ కాకపోవడంతో కొన్నిరోజులు వాయిదా పడింది. చివరకు సంపత్ స్థానాన్ని పవర్ ఫేం బాబీ(కేఎస్ రవీంద్ర) తో భర్తీ చేయటం కూడా జరిగింది. తాజాగా బాబీ స్క్రిప్ట్ పనులను పూర్తి చేశాడని వినికిడి. దీంతో ఈ నెల 14న ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఈ సినిమాను పవన్ సన్నిహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. హైదరాబాద్ లోనే తొలి షెడ్యూల్ ను చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్లు సమాచారం.