మారుతికి భలే భలే మంచి రోజులొచ్చాయండీ... ఆయన సినిమా ఇంత సెన్సేషన్ సృష్టించడంతో లెవల్ పూర్తిగా మారిపోయింది. పెద్ద స్టార్లంతా మాతో ఓ సినిమా చేయమనే ఆఫర్లు ఇస్తున్నారట. ఇప్పుడు నిర్మాత అరవింద్ బిఎం డబ్ల్యూ కారు కూడా బహుమతిగా ఇవ్వబోతున్నారట. నాని చిత్రానికి ముందు చిన్న తారలతో చేసిన సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగులతో బూతు డైరెక్టర్ అన్న పేరు కూడా పడిపోయిందట. మరి ఇప్పుడు ఆ ఛాయలు ఏమీ కనిపించకుండా... చాలా జాగ్రత్తగా తీసి తన పేరు తన పేరుకు ముందున్న బూతును చెరిపేసుకునే ప్రయత్నం చేశాడు. భలే భలే మగాడివోయ్ చిత్రంతో క్లీన్ ఎంటర్ టైనర్ గా సెన్సార్ సర్టిఫికెట్ కూడా అందుకున్నాడు. ఇక ముందు నుంచి ఇలాంటి క్లీన్ కామెడీ అందిస్తానని కూడా మాటిచ్చాడు. ఇన్న మార్పులతో పాటు ఆయనకు ఒక పక్క డాలర్ల వర్షం కురుస్తుండగా మరో పక్క బిఎండబ్యు కారు కూడా వచ్చేస్తోంది. ఒక్క సినిమా మారుతి జీవితాన్నే మార్చేసిందండీ....