చెర్రీ కోసం బరిలోకి దిగుతున్నాడు

October 31, 2015 | 06:03 PM | 4 Views
ప్రింట్ కామెంట్
allu-aravind-producer-tani-oruvan-remake-niharonline

రాంచరణ్ తన తర్వాతి ప్రాజెక్ట్ 'తని ఒరువన్' రీమేక్ చేయనున్నాడనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకి నిర్మాత డీవీవీ దానయ్య అని కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ సినిమా నిర్మాతగా అల్లు అరవింద్ వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని గురించిన రకరకాల వార్తలు ఫిల్మ్ నగర్లో షికారు చేస్తున్నాయి.

చరణ్ 'బ్రూస్ లీ' సినిమాని డీవీవీ దానయ్య నిర్మించాడు. ఈ సినిమాపై నమ్మకంతో ఆయన, చరణ్ తదుపరి సినిమాను కూడా తాను నిర్మించనున్నట్టు చెప్పాడు. అయితే 'బ్రూస్ లీ' ఫలితం నిరాశాజనకంగా రావడంతో, ఆయన మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. చిరుత, మగధీర టైంలో అరవింద్ సలహాల మేరకే చరణ్ నిర్ణయాలు తీసుకునేవాడట. అయితే మగధీర తర్వాత చెర్రీ రేంజ్ పెరగటంతో అరవింద్ ను పక్కన పెట్టినట్లు సమాచారం. ఇక చిరంజీవి కూడా 'బ్రూస్ లీ' ఫలితంతోపాటు ఈ మధ్య వచ్చిన చెర్రీ చిత్రాల్లో పెద్ద హిట్ ఏం లేకపోవటంతో ఇకపై అరవింద్ తో చర్చించాలని సూచించాడట.  

ఇక మీదట చరణ్ సినిమా వ్యవహారాలను దగ్గరుండి చూసుకోమని అల్లు అరవింద్ ను కోరాడట. ఈ నేపథ్యంలో 'తని ఒరువన్' కథ విషయంలో మార్పులు .. చేర్పులు చూసుకోవడమే కాకుండా, ఆ సినిమాకి ఆయన నిర్మాతగా కూడా వ్యవహరించనున్నాడని అంటున్నారు. మరి ఈ సారైనా చరణ్ కి మగధీర రేంజ్ హిట్ దొరుకుతుందేమో చూడాలి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ