అల్లు అర్జున్ ఇద్దరమ్మాయిలతో తెలుగు ఇండస్ట్రీలో పాపులర్ అయ్యింది కేథరిన్ త్రెసా. అంతకుముందు చమ్మక్ ఛల్లో అనే సినిమాతోనే వెండితెరకు పరిచయమైన అది అంతగా ఆడకపోవటంతో పెద్ద పేరు రాలేదు. అయితే గ్లామర్ పరంగా ఆకట్టుకోవటంతో తర్వాతి ఛాన్స్ బన్నీతో వంటి స్టార్ హీరోయిన్ తో కొట్టేసింది. ఇక ఆ తర్వాత వరుస ఛాన్స్ లతో దూసుకెళ్తుంది. మధ్యలో కాస్త గ్యాప్ వచ్చినప్పటికీ కన్నడ, తమిళ చిత్రాలకు ఆ సమయాన్ని కేటాయించేసింది. ఇక ఇప్పుడు తిరిగి తెలుగులో పాగా వేసేందుకు సిద్ధమైపోతుంది.
ఈ మధ్య రుద్రమదేవి చిత్రంలో ఓ పాటలో తెగ ఎక్స్ పోజింగ్ చేసిన ఈ భామ ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచేందుకు సిద్ధమైపోయిందని సమాచారం. బన్నీ బోయపాటి చిత్రంలో ఓ హీరోయిన్ గా నటిస్తున్న కేథరిన్ గ్లామర్ కే ప్రాధాన్యం ఇస్తుందట. ఇక తమిళ్లో అయితే మరింత హాట్ గా కనిపించే ప్రయత్నాన్ని మొదలుపెట్టిందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆమె విశాల్ జోడీగా నటిస్తోన్న 'కథాకళి' సినిమాలో అందాల విందు చేయనుందని సమాచారం. ఈ చిత్రంలో ఆమె చాలా రొమాంటిక్ గా కనిపించబోతుందని టాక్. ఓ ఎపిక్ సినిమాలోనే ఆ రేంజ్ లో అందాలను చూపిస్తే... మాములు చిత్రంలో ఇంకెంత చెలరేగిపోతుందో కదా. ఈ సినిమా విడుదల తరువాత ఆమెను మరిన్ని అవకాశాలు వెతుక్కుంటూ రావడం ఖాయమని చెప్పుకుంటున్నారు.