ఇది కావాలని చేసింది కాకపోవచ్చు...

April 09, 2015 | 01:29 PM | 62 Views
ప్రింట్ కామెంట్
Allu_Arjun_about_dasari_satyamurthy_function_niharonline

సన్ ఆఫ్ సత్యమూర్తి పాటల వేడుకలో దాసరి నారాయణరావు వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ఇన్నాళ్ళకు నోరు విప్పారు. అది దాసరిగారి వ్యక్తిగత అభిప్రాయం. నా అభిప్రాయం ఏమిటో 'రుద్రమదేవి' పాటల వేడుకలో చెప్పాను గా... ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లాంటి లెజెండ్స్‌ గురించి చెప్పినప్పుడు చిరంజీవిగారి గురించి కూడా ప్రస్తావించాల్సింది. ఇది కావాలని చేసింది కాకపోవచ్చు అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. 'సత్యమూర్తి..' పాటల వేడుకలో దాసరి నారాయణరావు స్టైల్ నటుల్లో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ తరవాత పవన్‌ కల్యాణే అన్నారు. ఈ మాట మెగా అభిమానులను బాధించింది. చిరంజీవి పేరు ప్రస్తావించలేదని వాళ్ళు కోపగించుకున్నారు కూడా. తాజాగా ఈ అంశం గురించి అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. కొన్నిసార్లు వేదికపై కొన్ని పేర్లు చెప్పడం మర్చిపోవచ్చు. ఒకసారి ఆడియో వేడుకలో దేవిశ్రీ ప్రసాద్ పేరు చెప్పడం నేనే మర్చిపోయా. దాసరి గారు కూడా అలాగే మర్చిపోయి ఉండవచ్చని నేననుకుంటున్నాను. ఆయన మా మా ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన్ని గౌరవించాలి.... అంతే అన్నారు. ఈ విమర్శల వల్లే వరంగల్‌లో జరిగిన 'రుద్రమదేవి' ఆడియోలో చిరంజీవి పేరు ప్రత్యేకంగా ప్రస్తావించిన సంగతి అర్జున్ ఒప్పకున్నాడు. ఆ చెట్టు నీడనే (చిరంజీవి) పెరిగామని అభిమానుల సమక్షంలో అని మెగా అభిమానులను సంతోషపరిచారు. దట్ ఈజ్ అల్లు అర్జున్... నొప్పించక తానొవ్వక..... ధన్యుడై పోయాడు.
 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ