గోపీ చంద్ వరుసగా రెండు హిట్లిచ్చి, ఇటీవల కాలంలో సక్సెస్ ఇచ్చే హీరోల ఖాతాలో చేరిపోయాడు. లౌక్యం, జిల్ సినిమాలు రెండు మంచి కలెక్షన్లే సాధించాయి. రెండూ కూడా కమర్షియల్ ఎంటర్ టైన్ మూవీలుగా ముద్ర వేసుకున్నాయి. దీంతో ఇటీవల విడుదలైన జిల్ సినిమా శాటిలైట్ హక్కులు మంచి రేటుకు అమ్ముడు పోయాయి. ఓ టీవీ ఛానెల్ ఈ హక్కులను 4.75 కోట్లకు సొంతం చేసుకుందని సమాచాం. దర్శకుడు కొత్త వాడే అయినప్పటికీ పెద్ద డైరెక్టర్ల స్థాయిలో క్వాలిటీ అందించడంతో, సినీ పరిశ్రమ ద్రుష్టిలో పడిపోయాడు రాధాక్రుష్ణ కుమార్.