సన్నాఫ్ సత్యమూర్తి తరువాత కొంత గ్యాప్ తీసుకుని బోయపాటి శ్రీను దర్శకత్వం లో సరైనోడు గా స్క్రీన్ మీదకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమా పూర్తి కాకముందే మరో సినిమాకు కమిట్ అయ్యాడు. బోయపాటి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న సరైనోడులో రకుల్ ప్రీత్ సింగ్ తొలిసారిగా హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా కు కూడా సెట్ చేసుకున్నాడట. ఆయన తరువాతి సినిమా డైరెక్టర్ హరీష్ శంకర్ అని తెలుస్తోంది. ఇటివలే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాతో మంచి హిట్ అందుకున్న హరీష్ కు ఈ సినిమా చూసి ఓ మంచి సబ్జెక్టు రెడీ చేయమని చెప్పాడట అర్జున్. ఇప్పటికే వరుసగా హిట్లు కొడుతున్న ఈ స్టార్ హీరో తనతో ఓ సినిమా చేయమని అడిగితే, ఆ డైరెక్టర్ కాదంటాడా తన చేతిలోకి ఓ స్టార్ హీరో వచ్చాడని సంబరపడిపోతూ స్క్రిప్ట్ రెడీ చెయ్యడానికి సిద్ధ పడ్డాడట హరీష్ శంకర్.