యూఎస్ లో సుబ్రహ్మణ్యం చాలా వీక్...

September 26, 2015 | 02:16 PM | 2 Views
ప్రింట్ కామెంట్
subramanyam-for-sale-new-posters-niharonline_(15)

హరీష్ శంకర్ చాన్నాళ్ళ తరువాత మరో హిట్ కొట్టాడు. ఈ సినిమా రెండు రాష్ట్రాల్లోనూ అదిరిపోయే కలెక్షన్లు రాబడుతోంది. కానీ సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాకు యూఎస్ లో రెస్పాన్స్ మాత్రం అంతగా లేనట్టు తెలుస్తోంది. అక్కడ తొలి రోజు ఈ సినిమాకు కేవలం 8 వేల డాలర్లు మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి. ఆసక్తి చూపిన చోట్ల డిస్ట్రిబ్యూటర్లు సమయానికి షోలు వేయకపోవడం వల్ల కూడా కలెక్షన్లు తగ్గాయనుకుంటున్నారు. ఇక్కడ అదరగొట్టిన ఆ సినిమాకు అమెరికాలోనూ మన తెలుగు వాళ్ళు ఆదరిస్తారని ఆశించి చాలా భంగపడ్డారు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ టీం. అక్కడ వందకు పైగా థియేటర్లలో రిలీజ్ చేశారు. యుఎస్ కలెక్షన్లలో సగం ఖర్చులకే పోతుంది. మరి తొలి రోజు వచ్చిన కలెక్షన్లు చూస్తే సుబ్రమణ్యం చివరికి రాజుకు ఎంత మిగులుస్తాడో అని సందేహాలు కలుగుతున్నాయి. ఇప్పటికే బాగుందన్న రెస్పాన్స్ వచ్చింది కాబట్టి నెమ్మదిగా యూఎస్ లోనూ ఈ సినిమాను ఆదరించవచ్చనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీకెండ్స్ లో అక్కడ సినిమాలకు కలెక్షన్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ శని, ఆదివారాల్లో అయినా జనాలు ఈ సినిమా చూడవచ్చని అనుకుంటున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ