బండ బూతులు తిట్టేలా అనసూయ ఏం చేసింది?

July 15, 2015 | 05:12 PM | 3 Views
ప్రింట్ కామెంట్
allu_arjun_fans_fire_on_anchor_anasuya_niharonline

సినీ ఇండస్ట్రీలో ఒక హీరో మరో హీరో గురించి మాట్లాడినా... ఒక హీరోయిన్ ఇంకో హీరోయిన్ గురించి మాట్లాడిన వాళ్ల వాళ్ల ఫ్యాన్స్ తిట్టుకోవడం కామన్. ఈ మధ్య అది ఏ రేంజ్ కి వెళ్లిపోయిందటే.. హీరోలు సైలెంట్ గా తమ పని చేసుకుపోతున్నా... ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో పోస్ట్ లు, కామెంట్లతో తెగ తిట్టేసుకుంటున్నారు. అయితే యాంకర్ అనసూయది మాత్రం ఇక్కడ కాస్త కొత్త కథ. గతంలో పవన్ కళ్యాణ్ చిత్రంలో ఐటెం సాంగ్ ఆఫర్ ను వద్దనుకుని ఫ్యాన్స్ ఆగ్రహాన్ని చవిచూసింది. ఓ వైపు  తిట్లు దండకం తనపై పడుతున్నా... తానేం ఐటెం గర్ల్ ని కాదంటూ ఆమె చెప్పుకొచ్చోంది. ''నేను చాలా ఎక్స్ ప్రెస్సివ్.. మనస్సులో ఏమీ ఉంచుకోలేను.. ఏదైనాసరే ఓపెన్ గా చెప్పేస్తా... అని వివరించందామె. అయితే ఇప్పుడు తాజాగా మరొక్కసారి మెగా ఫ్యాన్స్ మాటల దాడి తనపై పడేలా చేసుకుంది. ఇంతకీ అనసూయ ఏం చేసిందంటే... అల్లు అర్జున్ గురించి నెగటివ్ కామెంట్లు చేసిందట. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...''అసలు గంగోత్రి సినిమా చూసి షాకయ్యాను. మెగా ఫ్యామిలీ నుండి వచ్చినంత మాత్రాన ఇతను హీరో ఏంటి అనుకున్నా. ఆ లంగా వోణిలో డ్యాన్సులు చూస్తే.. యాక్.. కానీ,  ఆర్య సినిమాతో బన్నీ ఒక్కసారిగా మారిపోయాడు'' అంది. దీంతో ఫ్యాన్స్ ఫీలింగ్ హర్టయ్యాయి. ఫేస్ బుక్ లో వారి ఆగ్రహాం కట్టలు తెంచుకున్నాయి. అనసూయ, ఆమె ఫ్యామిలీని కలిపి బండ బూతులు తిట్టి పాడేశారు.  దీంతో విస్తుపోయిన అనసూయ వెంటనే ఆ వీడియోను డిలీట్ చేయించేసి.. దాని స్థాయిలో మరో ఎమోషనల్ వీడియోతో విచ్చేసింది.''నేను నా ఫీలింగ్స్ చెప్పాను తప్పా? మీరు నన్ను తిట్టండి కాని దానికి ఒక హద్దుంటుంది. మా ఫ్యామిలీని అంతటినీ కలిపి బూతులు తిడుతున్నారే ఇది మీకు సమంజసమేనా?'' అంటూ వాపోయింది అనసూయ. అయితే వారి వారి ఫేస్ వాల్యూ గురించి, స్క్రీన్ ప్రజంటేషన్ గురించి గతంలో ఆయా హీరోలే ధైర్యంగా చెప్పేసుకున్నారు. అలాంటిది ఆమె మాట్లాడితే తప్పేంటని కొందరు వాదిస్తున్నారు. అభిమానుల్లారా... అనసూయ ఫీలింగ్స్ ని కాస్త అర్థం చేసుకోండి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ