మీడియా వార్తలపై హర్ట్ అయిన రకుల్

July 15, 2015 | 05:12 PM | 3 Views
ప్రింట్ కామెంట్
rakul_preeth_sing_niharonlne.jpg

రకుల్ ప్రీత్ సింగ్ తన సీనియర్ నటీమణులపై కామెంట్ చేసిందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. ఇది తెలిసి రకుల్ ప్రీత్ సింగ్ చాలా బాధపడుతూ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అంతకు ముందు త్రిష తమన్నా లపై రకుల్ సెటైర్లు వేసిందంటూ వార్తల్లో రావడం దానికి ఆ సీనియర్ నటీమణులు మండిపడుతున్నారని కూడా రాశారు.  రకుల్ వాటిని ఖండిస్తూ... ‘‘నేను నా సీనియర్ నటీమణులపై కామెంట్స్ చేశానని అనుకోవడం విన్నాను. అయితే అవి ఎక్కడ ఎప్పుడు చేసానో తెలుసోకోవాలని ఉంది. నేను అసలు దేశంలోనే లేను. నేను ఇలా ఎప్పుడూ మాట్లాడను. మా సీనియర్ల నుంచి చాలా నేర్చుకున్నానని.. వారితో పోల్చుకోవటానికి కూడా ఇష్టపడడని చెపుతుంటాను. ప్లీజ్ మీడియాని రిక్వెస్ట్ చేస్తున్నా.... ఇలాంటి వార్తలను రాయకండి’ అంటూ రిక్వెస్ట్ చేసింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ