నిజమే... ఈ మధ్య కాలంలో హీరోలతో సినిమాలను బాగానే ప్రకటించేసి... ముహూర్తాలు కూడా మొదలెట్టేస్తున్నారు.... ఇక అక్కడినుంచి ఈ హీరోయిన్ కు డేట్స్ లేవు... ఆమె కేన్సిల్... మరొకరి కోసం వెతుకులాట... ఇంకా హీరోయిన్ దొరకలేదు.... ఇలాంటి వార్తలు చాలా చదువుతున్నాం... అంటే పెళ్ళికూతుర్లు కరువైనట్టే హీరోయిన్ల కొరత కూడా ఏర్పడినట్టే కదా...! మరదే... అందరి హీరోలకూ రియల్ లైఫ్ హీరోయిన్లు బాగానే దొరికేసారు.... ఎందుకంటే హీరోలు కదా మరి.... బన్నీ సినిమాకు కూడా హీరోయిన్ దొరకలేదట. సాక్షాత్తూ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ వంటి హీరోకు కూడా హీరోయిన్స్ కొరత ఉందంటే నమ్ముతారా మీరు? కాని నమ్మాల్సిందే. ఎందుకంటే.. ప్రస్తుతం సమంత, తమన్నా, కాజల్‌లు సీనియర్లు అయిపోయారు.. బాగా కొత్తమ్మాయిలకు ఛాన్స్ ఇద్దామంటే.. ఒకవేళ ఆడియన్స్‌కు నచ్చకపోయే ఛాన్సుంది కూడా. గతంలో భానుశ్రీ మెహ్రా, గౌరీ ముంజాల్ విషయంలో ఇలాగే జరిగింది.
అందుకే మనోడు ఆచితూచి అడుగులు వేసి.. ఎవర్ని తీసుకోవాలా అంటూ తంటాలు పడుతున్న సమయంలో మూడు పేర్లు కళ్ల ముందు మెరిసాయట. రాశి ఖన్నా, రెజీనా.... లేకపోతే సయేషా సైగల్ అనుకన్నారట. కాని వీళ్లందరూ ఇంకా స్టార్డమ్ లేని నాయికలు కావడంతో వారి క్యారక్టర్లకు పెద్దగా బరువు ఉండదని ఫీలవుతూ డెసిషన్ తీసుకోలేకపోతున్న సమయంలో రకుల్ ప్రీత్ సింగ్ బ్రహోత్సవం సినిమాను వదులుకున్నట్లు తెలిసిందట... ఇక ఆమెను లైన్లో పెట్టాలని చూస్తున్నారు.... అదండీ.... ఈ స్టైలిష్ స్టారూకూ హీరోయిన్ కొరత?