మెగా హీరోస్ అంతా ఒక్కటే: బన్నీ

November 02, 2015 | 05:36 PM | 4 Views
ప్రింట్ కామెంట్
meg-fans-fire-allu-arjun-niharonline

అల్లు రామయ్య మనవడు, చిరంజీవి బావమరిది కుమారుడైన అల్లు అర్జున్ తన దైన టాలెంట్ తో ఎదుగుతూ స్టైలిష్ స్టార్ అనే టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. ఇండస్ట్రీలో ఎప్పుడూ ఎవరినీ పల్లెత్తు మాట అనని ఎటువంటి కాంట్రవర్సీకి లోనుకాని వ్యక్తిగా అల్లు అర్జున్ ను మంచి పేరుంది. గత కొద్ది రోజులుగా ఫిల్మ్ నగర్లో, మీడియాలో మెగా ఫ్యామిలీ హీరోస్ మధ్య దూరం పెరుగుతోందని, అలాగే అల్లు అర్జున్ మెగా ఫాన్స్ కి దూరం అవుతున్నాడని, అల్లు అరవింద్ కూడా మెగా ఫ్యామిలీకి దూరంగా ఉన్నాడనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి వార్తల్లో నిజం లేదని, మెగా ఫ్యామిలీ అండ్ మెగా ఫ్యాన్స్ అంతా ఒక్కటే అనే పాయింట్ ని తేల్చి చెప్పేసాడు.
ఇక విషయంలోకి వెళితే మెగా ఫ్యామిలీ పై వస్తున్న వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టడం కోసం నిన్న అనగా ఆదివారం రోజున అల్లు అర్జున్ తన గీత ఆర్ట్స్ ఆఫీసులో మెగా ఫాన్స్ తో చాలా సమయం గడిపారు. ఈ సమావేశంలో ఆయన మెగా అభిమానులకు చెప్పింది ఒక్కటే ‘మెగా ఫ్యామిలీ అనేది ఎప్పుడూ ఒకటిగానే ఉంటుంది. మెగా ఫ్యామిలీ హీరోస్ అందరం ఎప్పటికీ కలిసే ఉంటాం.. అలాగే మా మెగా అభిమానులు కూడా కలిసే ఉండాలి. మెగా హీరోస్ కి స్పెషల్ గా బ్యానర్స్ కట్టేటప్పుడు అందులో అందరు హీరోస్ ఉండేలా చూసుకోండి. ఎవ్వరినీ వేరు చేసి చూడకండి అనే సందేశాన్ని అల్లు అర్జున్ అభిమానులకు పాస్ చేసాడు’. ఈ సంఘటనతో ఆ వార్తలకి ఫుల్ స్టాప్ పడిందని, ఇకపై అలాంటి వార్తలు రావని అల్లు అర్జున్ ఆశిస్తున్నాడు.
ప్రస్తుతం అల్లు అర్జున్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో, గీత ఆర్ట్స్ బ్యానర్ లో సరైనోడు అనే సినిమా చేస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ హీరోయిన్స్ గా కనిపించనున్నారు.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ