అల్లు అర్జున్‌ స్పోర్ట్స్‌ లుక్‌

December 06, 2014 | 03:55 PM | 46 Views
ప్రింట్ కామెంట్

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ -మాటల మాంత్రికుడు కాంబినేషన్‌ లో వస్తున్న సెకండ్‌ సినిమా ప్రస్తుతం సెట్స్‌ పై ఉంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ ని కూడా అప్పుడే ఫిక్స్‌ చేసేసారు. వీరిద్దరి కాంబినేషన్‌ లో వచ్చిన మొదటి సినిమా ‘జులాయి’ పెద్ద హిట్‌ అవ్వడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రతి సినిమాలోనూ కొత్తగా కనిపిస్తూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటాడు. ఈ సినిమా కోసం కూడా అల్లు అర్జున్‌ చాలా డిఫరెంట్‌ స్టైల్స్‌ ని ట్రై చేస్తున్నాడు. ఈ మూవీలో అల్లు అర్జున్‌ స్పోర్ట్స్‌ లుక్‌ లో న్యూ కాస్ట్యూమ్స్‌ లో కనిపించనున్నాడు. సినిమా మొత్తం స్పోర్ట్స్‌ లుక్‌ మరియు ఫార్మల్స్‌ లుక్‌ లో కనిపిస్తాడు. అల్లు అర్జున్‌ చేస్తున్న ఈ రొమాంటిక్‌ ఎంటర్టైనర్‌ లో సమంత, ఆద శర్మ, నిత్యా మీనన్‌ హీరోయిన్స్‌ గా నటిస్తున్నారు. కన్నడ సూపర్‌ స్టార్‌ ఉపేంద్ర, స్నేహ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాని ఫిబ్రవరి 5న రిలీజ్‌ చేయనున్నారు. యంగ్‌ తరంగ్‌ దేవీశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందిస్తున్న ఈ సినిమాని హారిక - హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌ పై ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు ఇప్పటికి 50 కోట్ల బిజినెస్ అయ్యిందంటే అల్లు అర్జున్ రేంజ్ ఏ మేరకు పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ