భువినుంచి దివికి దిగివచ్చిన అందగత్తెలా? అనిసించే మోడల్ మహరాణులు.. సరికొత్త డాలర్ టూ మిలియన్ డ్రీమ్ ఏంజెల్స్ పాంటసీ బ్రాలో మెరిసిపోతూ క్యాట్ వాక్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలని ఉందా? మోడల్ ప్రపంచానికి రాణులుగా పిలిచే అలెస్సాండ్రా అంబ్రాసియో, అడ్రినా లిమా.. వీళ్ళిద్దరూ కలిసి విక్టోరియా సీక్రెట్ షోలో పార్టిసిపేట్ చేసి మతులుపొగొట్టారు. లండన్‌లోని ఇయారీ కోర్ట్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన లావిష్ ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేసి తమ గ్లామర్‌తో ఇన్వైటీస్‌ను ఫ్లాట్ చేసిపారేశారు. ఈ క్యాట్ వాక్‌లో ఆంబ్రోసియో, ఆడ్రియానాలిద్దరూ మౌవాడ్ జూయలర్స్ తయారు చేసిన ఫాంటసీ బ్రాలను ధరించి మురిపించారు. 16వేల కెంపులు, వజ్రాలు, పుష్యరాగాలకు 18 క్యారెట్ల బంగారం జోడిరచి 1380 గంటలపాటు కష్టపడితే ఈ బ్రాలు తయారయ్యాయి. వీటితో పోటీపడే మేని సౌందర్యం సొంతం చేసుకున్న ఈ బ్రెజిలియన్ మోడల్స్ ఇద్దరూ ఆడియన్స్ కు నేత్రానందం కలిగించారు.