స్టైలిష్ స్టార్ కేసీఆర్ సాయం తీసుకున్నాడంట

April 18, 2016 | 11:21 AM | 4 Views
ప్రింట్ కామెంట్
kcr-inspiration-for-bunny-gonagannareddy-slang-niharonline

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి,  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసలు ఎక్కడ కలిసింది అనుకుంటున్నారా? గతంలో ఓ విషయంలో బన్నీకి కేసీఆర్ ఇన్స్పిరేషన్ గా నిలిచారట. తన లుక్, సెటప్ ను మొత్తంగా మార్చేసుకుని రుద్రమదేవీ చిత్రం కోసం కష్టపడ్డాడు అల్లు అర్జున్. భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం విడుదల సమయంలో నష్టాలు తప్పవనే అంతా అనుకున్నారు. అలాంటి సమయంలో తన గెస్ట్ అప్పీరియన్స్ తో సేఫ్ జోన్ లోకి తీసుకెళ్లాడు బన్నీ. సినిమాలో బన్నీ పాత్రకు 'గమ్మునుండవయ్' అనే ఊతపదం వుంటుంది. గమ్మతైన ఈ డైలాగుకి కేసీఆర్ తనకు స్ఫూర్తిగా నిలిచారని బన్నీ తాజాగా వెల్లడించాడు.

"గోన గన్నారెడ్డి పాత్రకు తెలంగాణ యాస అవసరం కాబట్టి దాని మీద దృష్టి పెట్టాను. ఆ సమయంలో కేసీఆర్ గారు గుర్తొచ్చారు. ఆయన మాట్లాడే తెలంగాణ యాస అద్భుతంగా వుంటుంది. రాష్ట్ర విభజనకు ముందు ఆయన చేసిన ప్రసంగాలు టీవీలో బాగా చూసేవాడిని. ఆయన ఎక్కువగా 'గమ్మునుండవయ్' అంటుంటారు. ఆ డైలాగుని ఊతపదంగా ఎంచుకుంటే ప్రేక్షకుల్లోకి బాగా వెళ్లిపోతుందని తీసుకున్నాను. అలాగే, ఆ డైలాగుకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది" థాంక్స్ చెప్పాడు బన్నీ.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ