చైతూకు తను స్టెప్ మదర్ మాత్రమేనట...

June 29, 2015 | 04:38 PM | 7 Views
ప్రింట్ కామెంట్
Amala_Naga_chaitanya_niharonline

ఈ మాటను తప్పు పట్టకండి... ఈ మాటలో చాలా అర్థం దాగి ఉంది. తనన్నఆ మాటలోని భావం అర్థం చేసుకున్న వారెవరూ తనను తప్పబట్టరు.... దట్ ఈజ్ అమల. నాగ చైతన్య నాగార్జునకు కొడుకేగానీ, తల్లి లక్ష్మి. ఆమె రామానాయుడు కుమార్తె అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఓ ఇంటర్వ్యూలో చైతన్య మీకు తల్లి స్థానాన్ని ఇస్తాడా? అని అడిగితే... దీనికి ఎంత చక్కని సమాధానం ఇచ్చిందంటే...? ‘‘ అలా ఎదురు చూడ్డం తప్పు. ఎందుకంటే తనకు తల్లి ఉంది. ఆ అమ్మ స్థానాన్ని లాక్కోవడం చాలా తప్పు. చైతన్య మా కుటుంబ సభ్యుడే... అతను వండర్ ఫుల్ బాయ్’’ అని చెప్పంది అమల. అంతే కాదు ’’తనకు అమ్మ, నాన్న, బ్రదర్, సిస్టర్ తో పాటు స్టెప్ మదర్ కూడా ఉంది’’ అంది. అంతే ఇక్కడ తాను తల్లయితే... అసలు తల్లికి అన్యాయం చేసినట్టవుతుందని ఆమె ఉద్దేశం. తన కుటుంబ సభ్యులతో చైతూ చాలా బాగా ప్రవర్తిస్తాడని, ఇంటికి వచ్చినపుడు చాలా కేరింగ్ గా ఉంటాడని... తను ఎవరి నుంచి ఏమీ ఆశించడని అమలు చెప్పింది. అక్కినేని కుటుంబంలో కలిసిపోవడానికి తాను ఎలాంటి ఇబ్బందులూ పడలేదనీ, మావయ్య ఏఎన్ఆర్ నాగ్ తో తన బంధాన్ని చక్కగా అర్థం చేసుకున్నారని... అత్తయ్య అన్నపూర్ణ తనకు తెలుగు సంప్రదాయాల్ని, భాషను నేర్పారని చెప్పింది అమల.

తనను చూస్తే చాలా గౌరవం కలుగుతుంది. తన పలకరింపు తీరు మనస్సుకు శాంతి కలిగిస్తుందనిపిస్తుంది. ఎంత గొప్ప హోదాలో ఉన్న అతి సామాన్యురాలిగా కనిపించే అమలను చూసి అందరూ చాలా నేర్చుకోవాలనిపిస్తుంది. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ