ఈ మధ్య వేదం నాగయ్య గురించిన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసిర విఫమం తోలిపిందు, అన్ని వెబ్ సైట్లు స్పందించి వార్తలు రాశాయి. దీన్ని అందరూ చదివి అయ్యో అనుకుంటుంటే... కొందరు నెటిజన్లు కొంతమంది రాజకీయ నాయకుల, సినీ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. దీనికి తెలంగాణ ఐటి మినిష్టర్ వెంటనే స్పందించారు. కష్టాల్లో ఉన్న నాగయ్య ఏ ప్రాంతం వాడనేది ఆయన చూడలేదు. గుంటూరు నుంచి వచ్చిన పేద రైతు నాగయ్య ‘వేదం’ సినిమాలో నటించి, ఆ తరువాత పెద్ద సినిమా ఛాన్సులు రాక, చేతిలో చిల్లి గవ్వ లేక ఫిలిం నగర్ వీధుల్లో అడుక్కుంటున్నాడు. నాగయ్య డిటైల్స్ తెలుసుకన్న కేటీఆర్ ఆయన్ను తన ఆఫీసుకు పిలిపించి, ఓ లక్ష రూపాల చెక్ ను అందించాడు. అంతే కాదు. గవర్నమెంటు తరఫున ఫించను కూడా ఇప్పించే ఏర్పటు చేయించారు. అంతే కాదు.... తెలుగు సినిమా ఆర్టిస్టుల సంఘంలో అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ తో మాట్లాడి వెంటనే నాగయ్యకు ఏదైనా సహాయం అందించాలని కోరాడు. ఈ మధ్య కాలంలో ఏ రాజకీయ నాయకుడు ఇంత త్వరగా స్పందించిన దాఖకాలు లేవు. దీంతో సినిమా ప్రజల హృదయాలను టచ్ చేశాడు కేటీఆర్...