సెలబ్రిటీల రూమర్స్ ముఖ్యంగా సినిమా వాళ్ళ వార్తలు కథలు కథలుగా విపరీతంగా పాకిపోతూ ఉంటాయి. అమలాపాల్ మరోసారి ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలపై ఆమె స్పందించింది. అదే నిజమైతే ఏదీ దాచాల్సిన అవసరమే లేదంటోంది. ఏ విషయమైనా ట్విట్టర్ లో చెబుతానని అంటోంది. ప్రస్తుతం ఈమె భర్త విజయ్ తో విదేశాల్లో ఉంటోంది. ‘‘నేను గర్భవతి నంటూ మీడియా ప్రచారం చేస్తోంది... ఈ విషయంలో అభిమానులు నిరాశ పడితే క్షమించండి. నేనింకా కొన్నాళ్లు ఎంజాయ్ చేద్దామనుకుంటున్నాను. ఇలా ఊహించుకోవడం ఇది రెండో సారి. అది నిజమైతే దాచాల్సిన అవసరం నాకు లేదు’’ అని ట్వీట్ చేసింది.