రాంచరణ్ ఎవడు, శంకర్ ఫ్రెస్టేజియస్ మూవీ ఐ సినిమా హీరోయిన్ ఎమీజాక్సన్ సూర్యకు షాక్ ఇచ్చింది. వెంకట్‌ప్రభు దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందుతున్న మాస్ సినిమాలో ఆమె ఎంపికైనా ఎందుకో నచ్చక మధ్యలోనే డ్రాప్ అయ్యింది. ఇప్పుడు ఆమె రజనీ అల్లుడు ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో ధనుష్‌తో రొమాన్స్ చేసేందుకు సిద్ధమైంది ఈ బికినీ భామ. రీసెంట్‌గా వేళ ఇల్ల పట్టాదరి(వీఐపీ)తో హిట్ కొట్టిన ధనుష్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వీఐపీ దర్శకుడు వేల్ రాజనే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభమయ్యే ఈ సినిమా టైటిల్, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని హీరో ధనుష్ ట్విట్టర్‌లో తెలిపాడు. ఏదేమైనా ఎమీ సూర్య ప్రతిష్ఠాత్మక చిత్రం నుంచి తప్పుకుని ధనుష్‌ను ఎంచుకోవడంతో కోలీవుడ్‌లో కాస్త హాట్‌టాపిక్ అయ్యింది.