బన్నీ కోసం బికినీ బేబీ

March 02, 2016 | 05:39 PM | 2 Views
ప్రింట్ కామెంట్
allu-arjun-amy-jackson

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడి చిత్రం ముగింపు దశకు చేరుకుంది. దీంతో గ్యాప్ ఇవ్వకుండా తన తర్వాతి ప్రాజెక్టును కూడా పట్టాలెక్కేంచేందుకు సిద్ధమైపోతున్నాడు అల్లువారబ్బాయి. లింగుస్వామి కథకు ఓకే చెప్పటం, దానిపై విశాల్ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేయటం తెలిసిందే. అయితే అనవసర రచ్చ ఎందకనకున్నాడో ఏమో సడన్ బన్నీ ఆ ప్రాజెక్టును సైడ్ చేశాడు. దీంతో గతంలో తనకు ఓ మంచి కథను వినిపించిన విక్రమ్ కుమార్ తో సినిమా చేసేందుకు సిద్ధమౌతున్నాడంట.

          13బి, ఇష్క్, మనం, తాజాగా సూర్యతో 24 ఇలా సబ్జెక్టు సబ్జెక్టు సంబంధం లేకుండా సినిమాలు తీస్తుంటాడు విక్రమ్ కుమార్. దీంతో బన్నీతో ఎలాంటి కథను తెరకెక్కించబోతున్నాడోనని ఇప్పటి నుంచే అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ఈ  సినిమాలో, కథానాయికగా ఎమీ జాక్సన్ ను తీసుకునే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమా బైలింగువల్ గా తెలుగు, తమిళం భాషల్లో తెరకెక్కనుందట. దాంతో ఈ రెండు భాషల్లోను మంచి క్రేజ్ వున్న కథానాయికను ఎంచుకోవాలని అనుకున్నారట. ఎమీ జాక్సన్ అయితే బెస్ట్ అనుకుని, ఆమెను సంప్రదించే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. చరణ్ సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన ఎమీ జాక్సన్ ను, మళ్లీ అల్లు అర్జున్ సినిమా కోసం ట్రై చేస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం ఆమె 'రోబో 2.0' సినిమా షూటింగులో బిజీగా వుంది. దీంతో ఆమె డేట్స్ సర్దుతుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ