జక్కన్న సినిమాలో సునీల్?

March 02, 2016 | 04:51 PM | 3 Views
ప్రింట్ కామెంట్
Sunil-next-movie-tiltled-as-jakkanna-niharonline

కమెడియన్ నుంచి హీరోగా మారి లాంగ్ టైం ఆ స్టేటస్ లో కొనసాగినవారు లేరనే చెప్పాలి. అలీ, బ్రహ్మీ, బాబు మోహన్ ఇలా అంతా హీరోలుగా సినిమాలు తీసి దెబ్బతిని, తిరిగి కామెడీ బాట పట్టినవారే. అయితే ఇప్పుడున్న జనరేషన్ టేస్ట్ కి అనుగుణంగా హీరో బాడీ లాంగ్వేజ్ లోకి మారిపోవటంలో సునీల్ సక్సెస్ అయ్యాడనే చెప్పుకొవచ్చు. తొలినాళ్లలో కామెడీ సబ్జెక్టులపై దృష్టి సారించి రాను రాను మాస్ క్యారెక్టర్ల జోలికి వెళ్లి  వరుస ఫ్లాపులతో ఘోరంగా దెబ్బతిన్నాడు. తాజా చిత్రం కృష్ణాష్టమి సినిమా డిజాస్టర్ కావటంతో తదుపరి ప్రాజెక్టుపై దృష్టిసారించాడు హీరో సునీల్.

ప్రస్తుతం వీరుపోట్ల దర్శకత్వంలో వీడు గోల్డెహె చిత్రంలో నటిస్తున్నాడు సునీల్. కామెడీ ఎంటర్ టైనర్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో తిరిగి ఫాంలోకి రావాలని ప్రయత్నిస్తున్నాడు. అదే టైంలో రచయిత వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఓ సినిమాలో నటించేందుకు సిద్ధమైపోతున్నాడు. అధికారిక సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 'జక్కన్న' అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

జక్కన్నగా రాజమౌళి బాగా పాపులర్ అయ్యాడు. ఈ టైటిల్ అయితే జనంలోకి బాగా వెళుతుందనే ఉద్దేశంతో ఖరారు చేసినట్టుగా చెబుతున్నారు. అల్రెడీ సగం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్ర 'ఫస్టులుక్'తో మిగతా వివరాలను త్వరలో తెలియజేస్తుందట చిత్ర యూనిట్. ఇందులో ప్రియాంక చోప్రా కజిన్ మన్నారా చోప్రా సునీల్ కి జోడీగా నటిస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ