మారుతి సినిమాలు అనగానే ఒకప్పుడు బూతు చిత్రం అనే ఓ ఫీలింగ్ ఉండేది. ఈ రోజుల్లో, బస్ స్టాప్ లతోపాటు, ఆయన కథలు అందించిన కొన్ని చిత్రాల్లో అడల్ట్ కంటెంట్ మరీ ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. యూత్ తప్ప ఫ్యామిలీలు ఆయన చిత్రాలు చూడలేనంతంగా డబుల్ మీనింగ్ డైలాగులు ఉండేవి. అయితే భలే భలే మగాడివోయ్ తో ఆ మార్క్ ను ఒక్కసారిగా తుడిచిపడేసుకున్నాడు. ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్ అనో లేక తన చిత్రాలకు ఫ్యామిలీ ఆదరణ దక్కట్లేదన్న బాధో తెలీదు కానీ, నీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించాడు. ప్రస్తుతం వెంకటేష్ తో బంగారు బాబులో బిజీగా ఉన్న మారుతి తదుపరి ప్రాజెక్ట్ పై ఓ క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు.
భవిష్యత్తులో ఓ యానిమేషన్ సినిమా చేయాలనే కోరిక చాలా కాలంగా ఉందనీ, త్వరలో చేయవచ్చని సంకేతాలు ఇచ్చాడు. సినిమాల్లోకి రావడానికి ముందు మారుతి యానిమేషన్ రంగంలోనే వున్నాడనే విషయం తెలిసిందే. అందువల్లనే ఆయన ఆ వైపు దృష్టి పెడుతున్నాడన్న మాట. ఆ తరువాత ఆయన యానిమేషన్ మూవీ పై దృష్టి పెడతాడేమో చూడాలి. యూత్ నుంచి ఫ్యామీలీ ఆపై పిల్లల గురించి ఇలా మారుతి ప్రస్థానం సాగే విధానం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.