యాంకర్ ఆంటీకి ప్రమోషన్

December 09, 2014 | 02:45 PM | 100 Views
ప్రింట్ కామెంట్

చిట్టి పొట్టి బట్టలతో పాపులర్ అయిన బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయకు కొత్త ప్రమోషన్ వచ్చింది. త్వరలో వెండితెరపై ఈ హాట్ ఆంటీ నటించబోతుందని తెలుస్తోంది. అడవి శేషు హీరోగా రవికాంత్ దర్శకత్వంలో తెరకెక్కునున్న ఓ సస్పెన్స్ చిత్రంలో అనసూయ హీరోయిన్ గా నటించేందుకు ఒప్పుకుందట. అంతేకాదు ఈ చిత్రానికిగానూ భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సమాచారం. ప్రస్తుతం ఆడియో ఫంక్షన్లలో ఎక్కడ చూసినా అనసూయ హవానే కనిపిస్తోంది. సినిమాల ఆడియో విడుదల కార్యక్రమాలు, విజయోత్సవాలు.. ఇలా పలు కార్యక్రమాల్లో ఆమె తెగ కనిపిస్తోంది. జబర్దస్త్‌ షోతో జనాల నోళ్లలో బాగా పాపులర్ అయిన అనసూయ న్యూస్‌ రీడర్‌గా కెరీర్‌ మొదలుపెట్టి ఇప్పుడు హీరోయిన్‌గా నటించే స్టేజీకి ఎదిగింది. వాస్తవానికి చిత్రాలలో నటించే ఛాన్స్ ఆమెకు ఎప్పుడో వచ్చేసినా నిరాకరించింది. కొన్నాళ్ల క్రితం అత్తారింటికి దారేది, రేసుగుర్రం చిత్రాల్లో ఆఫర్లు వచ్చినా తిరస్కరించిందట. అయితే అందులో ఐటెం సాంగ్స్ కు నటించాల్సి రావటంతో నిరాకరించిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఒప్పుకున్న చిత్రంలో ఆమెది కీలకపాత్ర అట. ఇక ఈ చిత్రం ప్రముఖ నిర్మాణ సంస్థ పీవీపీ బ్యానర్‌లో తెరకెక్కుతున్నట్లు సమాచారం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ