అందాల ఆరబోత అంత అవసరమా?

December 20, 2014 | 02:25 PM | 56 Views
ప్రింట్ కామెంట్

మిస్ ఎర్త్ ఇండియా 2013 శోభిత ధూళిపాళ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ వైజాగ్ బ్యూటీ ఫొటోలు ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తున్నాయిప్పుడు. ఈమె హాట్ ఫొటో షూట్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. శిల్పారెడ్డి తర్వాత వచ్చిన మరో తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ. అయితే అమ్మాయి ఇలా పోజులివ్వడం కొందరు తెలుగు వారికి నచ్చినట్టు లేదు. డబ్బు సంపాదనకే తప్ప ఈ అందాల ఆరబోత అంత అవసరమా? అంటున్నారు. స్కూల్ టాపర్, మంచి క్లాసిక్ డాన్సర్ అయి ఉండి ఇంత కన్నా మంచి కెరీర్ దొరకలేదా అనుకుంటున్నారు. ఈమె మిస్ ఇండియా ఎర్త్ 2013 కిరీటాన్ని అందుకుంది. కింగ్ ఫిషర్ క్యాలెండర్ తో పాపులర్ అయ్యింది. ఇక సినిమా ఛాన్సుల కోసం చాలా ప్రయత్నాలే చేసిందట. తను ఊహించినట్టు హీరోయిన్ ఛాన్సలులేవీ రాకపోవడంతో, ఇక మళ్లీ బికినీ పోజులతో ఫొటోషూట్ లోకి దిగిపోయింది. నిజానికి ఈమె ఐఏఎస్ కావాలనుందట. మరి ఇదేం వైపరీత్యమో అర్థం కావడం లేదు. గ్లామర్ రంగం ఒక వ్యసనంలా తయారయ్యిందనడానికి ఇది ఒక ఉదాహరణ అనుకోవచ్చు. ఇక్కడ ప్రతిభ కన్నా బాడీ ప్రదర్శనకే ప్రాముఖ్యత. గౌరవమైన ఒక లక్ష్యాన్ని వదిలి ఇదే అంగాంగ ప్రదర్శన అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ