చివరి క్షణాల్లోనూ సినిమా ఆలోచనలే: అనీల్ కపూర్

February 20, 2015 | 01:27 PM | 31 Views
ప్రింట్ కామెంట్
Anil Kapoor_ramanaidu_niharonline

రామానాయుడు అంత్యక్రియల్లో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ పాల్గొని, ఆయన సినిమాకు అందించిన సేవలు మరువలేనివని అన్నారు. రామానాయుడు బాలీవుడ్ సినిమాల్లో అనీల్ కపూర్ హీరోగా నాలుగు సినిమాలు చేశారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ తనను ఓ కొడుకులా భావించారని, వారి కొడుకులతో సమానంగా చూశారని అన్నారు. తాను కూడా ఆయనను తండ్రిలా గౌరవించానని చెప్పుకున్నారు. ఎప్పుడు కలిసినా తనను హీరో అని పిలిచేవారని చెప్పారు. ఆయన అనుబంధమంతా సినిమాతోనే ముడిపడి ఉందని అన్నారు అనీల్ కపూర్. ఆయన తన ప్రతి పైసాని సినిమాకే పెట్టారని అన్నారు. రామానాయుడు లేని ఇండియన్ సినిమాని ఊహించుకోవడం చాలా కష్టమనీ అన్నారు. ఆయనతో తాను ఇన్సాఫ్ కి అవాజ్, రఖ్వాలా, జీవన్ ఏక్ సంఘర్ష్, హమ్ ఆప్ కే దిల్ రహెతే హై చిత్రాలు చేసినట్టు చెప్పారు. ఐదవ ప్రాజెక్టు రామానాయుడుదే అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల అది బోనీ కపూర్ కు అప్పగించారని చెప్పారు. హమారా దిల్ ఆప్ కే పాస్ హై అనే ఈ సినిమాలో అనీల్ కపూర్ తో ఐశ్వర్యారాయ్ హీరోయిన్ గా చేసింది. నాయుడుగారు అనీల్ కపూర్ తో చేసిన సినిమాలన్నీ బాలీవుడ్ లో బాగా హిట్ అయ్యాయి. ఆయన అంత్యక్రియల్లో బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, శ్రీదేవితో పాటు తమిళ నటుడు కార్తి ఇంకా అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుయ్యారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ