త్రివిక్రమ్ తాజా ప్రాజెక్ట్ కి సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. అదే సంగీత దర్శకుడి మార్పునకు సంబంధించి. ముందుగా 'అ ఆ' కోసం తమిళ మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ ని తీసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి అనిరుధ్ తప్పుకున్నట్టేననీ, మరో సంగీత దర్శకుడిని ఎంపిక చేసుకునే పనిలో త్రివిక్రమ్ ఉన్నాడని అంటున్నారు.
అయితే ఈలోగా అతను బీప్ సాంగ్ వివాదంలో చిక్కుకున్న కారణంగా, ఈ ప్రాజెక్టు పై దృష్టి పెట్టలేకపోయాడు. సినిమా షూటింగ్ 70 శాతం వరకూ పూర్తికావడంతో, త్రివిక్రమ్ ఆలోచనలో పడినట్టుగా ఇటీవల వార్తలు వినిపించాయి. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదుగానీ .. మొత్తానికి ఈ ప్రాజెక్టు నుంచి అనిరుధ్ తప్పుకున్నాడని అంటున్నారు. దాంతో ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ ను గానీ .. మిక్కీ జె.మేయర్ ను గాని తీసుకునే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నాడని చెబుతున్నారు. త్వరగా మ్యూజిక్ డైరక్టర్ ని ఎంపిక చేసి పనులు త్వరగతిన పూర్తిచేయాలన్న ఆలోచనలో చిత్ర నిర్మాత రాధాకృష్ణ కూడా త్రివిక్రమ్ పై ఒత్తిడి తెస్తున్నాడంట. నితిన్ సమంత అనుపమ పరమేశ్వన్ జంటగా నటించిన ఈ సినిమా మార్చ్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.