చురుకుగా, చలాకీగా సందడి చేస్తూ ఏ పాత్రనైనా అవలీలగా పోషించే కథానాయికగా అంజలి ముద్రపడిపోయింది. ఆ మధ్య ఆమె కెరియర్లో చిన్నపాటి గ్యాప్ వచ్చినా, ఈ మధ్య మళ్లీ స్పీడందుకుంది. అవకాశాలు బాగానే వస్తుండటంతో, అంజలి తన పారితోషికాన్ని కూడా డిమాండ్ ను బట్టే తీసుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. ఒకవైపున కథానాయికగా .. మరో వైపున కథానాయిక ప్రాధాన్యత గల పాత్రలను చేస్తూ, అతిథి పాత్రలను కూడా ఆమె ఒప్పేసుకుంటూ వెళుతోంది.
తాజాగా 'శంకరాభరణం' సినిమాలో ఒక గెస్టు రోల్ చేసిన అంజలి, తాజాగా 'సరదా' చిత్రంలోనూ అతిథి పాత్రను చేస్తోంది. ఈ సినిమా కోసం ఆమె 10 రోజులు పనిచేయవలసి ఉంటుందట. అందుకుగాను ఆమె 50 లక్షలు అడిగినట్టుగా తెలుస్తోంది. అంజలి రోజుకి 5 లక్షలు వసూలు చేస్తుందనేది ఇప్పుడు ఫిల్మ్ నగర్ చర్చల్లో వినిపిస్తోంది. ఇక అంజలికి ఆ మాత్రం క్రేజ్ వుంది కనుకనే, ఆమె డిమాండ్ చేసింది ఇవ్వడానికి నిర్మాతలు ఓకే అంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.